Harsh Kumar: ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారు..

ABN , First Publish Date - 2023-08-14T14:51:20+05:30 IST

రాజమండ్రి: ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ రిలయెన్స్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...

Harsh Kumar: ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీకి కట్టబెడుతున్నారు..

రాజమండ్రి: ఏపీలో అన్ని ప్రాజెక్టులు అదానీ (Adani)కి కట్టబెడుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రిలయెన్స్‌ (Reliance)కు అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ (Ex MP Harsh Kumar) ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ కేసులకు భయపడి బీజేపీ (BJP)కు అనుకూలంగా పనిచేస్తున్నారని, అలాగే టీడీపీ (TDP), జనసేన (Janasena)లు కూడా బీజేపీకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. పార్లమెంట్‌ (Parliament)లో అవిశ్వాస తీర్మానంలో చర్చ జరిగినప్పుడు వైసీపీ, టీడీపీలు మాట్లాడకపోవటం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకు తాకట్టుపెట్టారన్నారు. బీజేపీతో జనసేన కలిసి ఉంటే గత ఎన్నికల్లో వచ్చిన పలితాలే పవన్‌కు వస్తాయని జోష్యం చెప్పారు. జనసేన బీజేపీని వీడితే పవన్ కళ్యాణ్‌కు జనం బ్రహ్మరథం పడతారన్నారు.

ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం చాలా బలహీనంగా ఉందని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని హర్షకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏ మంత్రి పేరయినా ప్రజలకు తెలుసా? అని ప్రశ్నించారు. స్టేజి మేద జగన్ ఒక్కరే కూర్చుంటారని, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్టారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు మాత్రమే ఏపీని పరిపాలిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టారని, చంద్రబాబు (Chandrababu) కాళ్ళు తాను పట్టుకోలేదని, ఆత్మాభిమానం ఎవరికి తాకట్టుపెట్టలేదన్నారు. మణిపూర్ (Manipur) సంఘటన తర్వాత సిగ్గుతో బీజేపీ ప్రభుత్వం (BJP Govt.) దిగిపోవాలన్నారు. ప్రభుత్వ భూములను సయితం జగన్ అమ్మేస్తున్నారని, వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు శుద్ద దండగని అన్నారు. రూ. 5 వేల రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోగలరా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని పిలుపిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రత్యామ్నాయంగా ఎవరైనా వస్తారేమో, ప్రజలకు ఊపు వస్తే రాజకీయ పార్టీలు కొట్టుకుపోతాయని హర్షకుమార్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-14T14:51:20+05:30 IST