Train accident: పెరిగిన మృతులు.. పలు రైళ్లు రద్దు.. సమాచారం కోసం ఈ నంబర్లను సంప్రదించండి
ABN , First Publish Date - 2023-10-30T09:14:45+05:30 IST
జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కి పెరిగింది. కంటకాపల్లి రైల్వేజంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విజయనగరం: జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. కంటకాపల్లి రైల్వేజంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ రైల్వే బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల పేర్లు కంచుబారిక రవి, గిరిజాల లక్ష్మి, బలరామ్, అప్పలనాయుడు, కాపు శంభం, చల్ల సతీష్, పెనుమర్రి గౌరినాయుడుతోపాటు పలాస ప్యాసింజర్ రైలు గార్డ్ ఎం.ఎస్.రావు కూడా ఉన్నారు. ఇక రాయగడ రైలు ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మృతి చెందారు.
కేబుల్ సమస్యతో కంటకాపల్లిలో విశాఖ-పలాస రైలు ఆగింది. ఇదే రూటులో వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది. పలాస రైలు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఎదురుగా వస్తున్న గూడ్స్‌ను పలాస, రాయగడ రైళ్లు ఢీకొన్నాయి. పక్క ట్రాక్‌లోని గూడ్స్‌పైకి రైళ్లు దూసుకెళ్లడంతో పరిస్థితి మరింత బీభత్సంగా మారింది. ఇంజన్, గార్డు బోగీ, మరో రెండు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. రైలు ప్రమాదస్థలం నుంచి పలు బోగీలను అధికారులు తరలించారు. పలాస ప్యాసింజర్ 11 బోగీలు అలమండ స్టేషన్‌కు తరలించగా.. రాయగడ ప్యాసింజర్ 9 బోగీలు కంటకాపల్లి స్టేషన్‌కు తరలించారు. పట్టాలు తప్పి దెబ్బతిన్న బోగీలను అధికారులు క్లియర్ చేశారు.
పలు రైళ్లు రద్దు..
రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లు రద్దయ్యాయి. కోర్బా-విశాఖ, పారదీప్-విశాఖ రైళ్లు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. రాయగడ-విశాఖ, పలాస-విశాఖ రైళ్లు నిలిపివేశామని ప్రకటించారు. విశాఖ-గుణుపూర్, గుణుపూర్-విశాఖ రైళ్లలను కూడా రద్దు చేసినట్టు వివరించారు.
విశాఖ రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు
హెల్ప్‌లైన్ నంబర్లు: 0891 2746330, 0891 2744619
హెల్ప్‌లైన్ నంబర్లు: 81060 53051, 81060 53052
హెల్ప్‌లైన్ నంబర్లు: 85000 41670, 85000 41671
విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
హైల్ప్‌లైన్: 90302 26621, 70361 11169, 0891-2590102