CS Jawahar Reddy: గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్ష.. కలెక్టర్లు యుద్ధప్రాతిపదిక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-08-03T16:33:57+05:30 IST

పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు (Tidco Homes), ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ గృహ నిర్మాణాల ప్రగతిపై సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) సమీక్షించారు.

CS Jawahar Reddy: గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్ష.. కలెక్టర్లు యుద్ధప్రాతిపదిక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

అమరావతి: పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు (Tidco Homes), ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ గృహ నిర్మాణాల ప్రగతిపై సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) సమీక్షించారు.


" జిల్లా కలెక్టర్లు యుద్ధప్రాతిపదిక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ నెలాఖరుకు 5 లక్షల గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలి. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ పధకాలను మరింత వేగతవం చేయాలి. ఈ నెలాఖరుకు 5లక్షల గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు వీలుగా తగు చర్యలు తీసుకోవాలి. నిర్మాణం పూర్తి చేసే ఇళ్ళు వాటి కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదార్లు, డ్రైనేజీ, సోక్ పిట్లు నిర్మాణం వంటి కనీస సౌకరర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి. గృహనిర్మాణాలు పూర్తి చేసే కాలనీల్లో ప్రత్యేక ఆర్చ్ లను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో ఈనెలాఖరుకు గృహనిర్మాణ కాలనీలను పూర్తి చేయాలి." అని సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-08-03T16:34:31+05:30 IST