CBI Ex Director Nageswara Rao : ఆయన అనుమతి లేకుంటే చంద్రబాబుది అక్రమ నిర్బంధమే..

ABN , First Publish Date - 2023-09-09T13:55:41+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సీబీఐ మాజీ డైరక్టర్ ఎం నాగేశ్వరరావు స్పందించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని నాగేశ్వరరావు అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు.

CBI Ex Director Nageswara Rao : ఆయన అనుమతి లేకుంటే చంద్రబాబుది అక్రమ నిర్బంధమే..

ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సీబీఐ మాజీ డైరక్టర్ ఎం నాగేశ్వరరావు స్పందించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని నాగేశ్వరరావు అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేపట్టడానికి గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ(సి) సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సిందేనని సీబీఐ మాజీ డైరక్టర్ తెలిపారు. గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అన్న విషయంలో స్పష్టత కరువైందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే... ఆ పత్రాలు తమకు ఇవ్వాలని దర్యాప్తు అధికారులను డిమాండ్ చేయాలన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా, ఇవ్వకపోయినా... మొత్తం దర్యాప్తు చెల్లుబాటు కాదని సీబీఐ మాజీ డైరక్టర్ తేల్చి చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే... అక్రమ నిర్భంధం అవుతుందని పేర్కొన్నారు. అక్రమ నిర్భంధానికి పాల్పడిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని నాగేశ్వరరావు హెచ్చరించారు.

Updated Date - 2023-09-09T14:02:54+05:30 IST