Share News

ప్యాసింజర్ ట్రైన్‌కు బ్రేక్ ఫెయిల్.. స్టేషన్‌లో ఆగకపోవడంతో రైల్వే అధికారులు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-11-20T12:15:34+05:30 IST

గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్ ట్రైన్‌కు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంకటంపల్లి రైల్వే స్టేషన్‌లో బ్రేక్ ఫెయిల్ అయ్యి రైలు ఆగకుండా పోయింది.

ప్యాసింజర్ ట్రైన్‌కు బ్రేక్ ఫెయిల్.. స్టేషన్‌లో ఆగకపోవడంతో రైల్వే అధికారులు ఏం చేశారంటే..

అనంతపురం : గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్ ట్రైన్‌కు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వెంకటంపల్లి రైల్వే స్టేషన్‌లో బ్రేక్ ఫెయిల్ అయ్యి రైలు ఆగకుండా పోయింది. వెంకటంపల్లి తర్వాత వచ్చే ఇమాపురం స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన అధికారులు.. హుటాహుటిన మరో ఇంజన్‌ను తీసుకొచ్చి రైలుకు తగలించారు. అయితే రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - 2023-11-20T12:15:36+05:30 IST