YCP Minister Botsa: అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

ABN , First Publish Date - 2023-07-08T18:22:23+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)పై కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు (Ashok Gajapathi Raju) చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కౌంటర్ ఇచ్చారు.

YCP Minister Botsa: అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

విజయనగరం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)పై కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు (Ashok Gajapathi Raju) చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కౌంటర్ ఇచ్చారు.

''అశోక్ వ్యాఖ్యలపై బొత్స తత్వ హితబోధలు చేశారు. సమాజానికే మేం అంకితం. సమాజం ఆలోచననే మేం అమలు చేస్తున్నాం. మాలో వ్యక్తిగతాలు ఉండవు. మాట్లాడేటప్పుడు వెనుకా ముందూ ఆలోచించి మాట్లాడాలి. మాకు వ్యక్తిగత ద్వేషాలు ఉండవు. మా ముఖ్యమంత్రిది కూడా ఇదే పద్ధతి." అని అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.


జగన్‌పై అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలు..

టీడీపీ బస్సు యాత్రలో పాల్గొన్న అశోక్‌గజపతిరాజు జగన్‌మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు జగన్ రెడ్డి ట్రాన్సఫర్ పెట్టుకున్నారట.!. జైల్లో చిప్ప కూడున్న తిన్న దొంగను మనం ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చేసేశాం. అభివృద్ధి చేసేశాం అని చెబుతున్న వైసీపీ నేతల చేష్టలు ఏంటో మనకు తెలియవా.!'' అని అశోక్‌గజపతిరాజు విమర్శించారు.


ఆర్థిక నేరాలకు పాల్పడి, పదహారు నెలలు జైల్లో మగ్గిన దొంగను ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలంతా నేడు నరకాన్ని చూస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్‌ అంటూ తండ్రి ఫొటోను అడ్డం పెట్టుకుని వచ్చిన ఆయన నేడు అన్నివర్గాల ప్రజలకు నరకం చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపైనా నిప్పులు చెరిగారు. బెయిల్‌పై చంచల్‌గుడా జైలు నుంచి వచ్చిన ఆయన తిరిగి విశాఖ జైలుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్‌రెడ్డి మోదీ కాళ్లముందు మెడలు వంచడం ద్వారా తెలుగుజాతి గౌరవాన్ని మంటకలుపుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే ధైర్యం ఆయనతో పాటు మంత్రులకూ లేదన్నారు. కేసులకు భయపడొద్దని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ధైర్యాన్నిచ్చారు.

Updated Date - 2023-07-08T18:24:45+05:30 IST