Somuveerraju: చార్జిషీట్ల ఉద్యమానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2023-05-10T11:02:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జిషీట్ల ఉద్యమానికి గ్రామస్ధాయి నుంచి మంచి స్పందన వస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు.

Somuveerraju: చార్జిషీట్ల ఉద్యమానికి విశేష స్పందన

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జిషీట్ల ఉద్యమానికి గ్రామస్ధాయి నుంచి మంచి స్పందన వస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు (AP BJP Chief Somuveerraju) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించడంతో పాటు ఆధారాల సేకరిస్తున్నామన్నారు. శక్తి కేంద్రాలు అంటే నాలుగు పోలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రంగా బీజేపీ పార్టీ కార్యక్రమం రూపొందించుకుందన్నారు. అందుకు అనుగుణంగా 5000 శక్తి కేంద్రాల్లో బీజేపీ నేతల (BJP Leaders) పర్యటనలు కొనసాగాయని తెలిపారు. విజయవాడ వన్ టౌన్‌లో బీజేపీ శ్రేణులు కాలనీల్లో పర్యటించి అభియోగాలు నమోదు చేశారన్నారు. ఈ సందర్భంగా కార్పోరేషన్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా అభియెగాలను స్వీకరించారన్నారు. అరసవల్లిలో కేంద్రం నిధులను దారి మళ్లించిన సంఘనలు ఉన్నాయని బీజేపీ నేతలు ప్రకటించారని.. నెల్లిమర్లలో అధికార పార్టీ వైసీపి నేతలు అవినీతికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. భీమవరం సమీపంలోని పాలకోడేరులో ఎస్సీ కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలపై బీజేపీ నేతలు అభియోగాలు నమోదు చేశారన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయశాఖ, సివిల్ సప్లైయ్ అధికారుల వల్ల సమస్యలు ఉన్నాయని రైతాంగం బీజేపీ నేతల దృష్టికి తెచ్చారన్నారు. రాయలసీమలో అన్నమయ్య డ్యాంకు సంబంధించిన సమస్యపై ఇప్పటికే బీజేపీ కోర్టులో కేసు వేసిందన్నారు. బద్వేలు తదితర ప్రాంతాల్లో సమస్యలపై బీజేపీ నేతలు అభియోగాలు నమోదు చేశారని సోమువీర్రాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-10T11:02:51+05:30 IST