TDP: అక్కడ ఎమ్మెల్యే చేత చొక్కా ఎందుకు విప్పించలేదు?: అనిత
ABN , First Publish Date - 2023-04-23T22:08:23+05:30 IST
సీఎం జగన్ (CM Jagan) స్వార్థం కోసం దళితులను బలిపశువుల్ని చేస్తున్నారని టీడీపీ (TDP) నేత వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు.
అమరావతి: సీఎం జగన్ (CM Jagan) స్వార్థం కోసం దళితులను బలిపశువుల్ని చేస్తున్నారని టీడీపీ (TDP) నేత వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. దళిత మంత్రిని రోడ్డుపై చొక్కా విప్పించిన ఘనత జగన్‌రెడ్డిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురంలోనూ చంద్రబాబు రోడ్‌షో జరిగిందని, జగన్ అక్కడ ఎమ్మెల్యే చేత చొక్కా ఎందుకు విప్పించలేదు? అని ఆమె ప్రశ్నించారు. అతను సామాజికవర్గం వాడనా?, దళితులపై వైసీపీ (YCP) నేతలు దాడులు చేస్తుంటే.. సురేష్ ఎందుకు చొక్కా విప్పి నిరసన తెలపలేదు? అని అనిత ప్రశ్నించారు.