Share News

AP News: హద్దు మీరితే బడిత పూజ చేస్తాం.. ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టీడీపీ నేతల హెచ్చరిక

ABN , First Publish Date - 2023-10-29T07:57:48+05:30 IST

తమ పార్టీ అధినేత చంద్రబాబునుద్దేశించి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌

AP News: హద్దు మీరితే బడిత పూజ చేస్తాం.. ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టీడీపీ నేతల హెచ్చరిక

విశాఖపట్నం, అమరావతి, (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ అధినేత చంద్రబాబునుద్దేశించి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌(MP Gorantla Madhav)ను టీడీపీ నాయకులు హెచ్చరించారు. హద్దు మీరితే బడిత పూజ తప్పదంటూ శనివారం విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద కర్రలు పట్టుకుని నిరసన తెలిపారు. ‘ఖబడ్దార్‌ గోరంట్ల...’ అంటూ నినాదాలు చేశారు. కాగా, చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ దిష్టిబొమ్మను టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద దహనం చేశారు.

Updated Date - 2023-10-29T07:57:48+05:30 IST