AP News: ‘సీబీఐ స్థానిక పోలీసుల్ని బతిమలాడటం సిగ్గుచేటు’

ABN , First Publish Date - 2023-05-22T18:24:32+05:30 IST

నేను కొట్టినట్లు ఉండాలి..., నువ్వు ఏడ్చినట్లు ఉండాలి అన్నట్లుగా వివేకా హత్య కేసులో సీబీఐ-ఆవినాష్ రెడ్డిల తీరు ఉందని...

AP News: ‘సీబీఐ స్థానిక పోలీసుల్ని బతిమలాడటం సిగ్గుచేటు’

అమరావతి: నేను కొట్టినట్లు ఉండాలి..., నువ్వు ఏడ్చినట్లు ఉండాలి అన్నట్లుగా వివేకా హత్య కేసులో సీబీఐ-ఆవినాష్ రెడ్డిల తీరు ఉందని టీడీపీ (TDP) సీనియర్ నేత టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు (Nakka Ananda Babu) మండిపడ్డారు. ఓ హత్యకేసు నిందితుడి అరెస్టు కోసం సీబీఐ స్థానిక పోలీసుల్ని బతిమలాడటం సిగ్గుచేటన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఎస్పీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు చెప్పటం దుర్మార్గమన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించలేమని పాలకులే ఒప్పుకుంటున్నప్పుడు ఇక ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చుగా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యoపై నమ్మకం పెరగాలంటే, తమ చిత్తుశుద్దిని నిరూపించుకునేలా సీబీఐ (CBI) పనిచేయాలన్నారు.

Updated Date - 2023-05-22T18:24:32+05:30 IST