ACB: లింగమనేని రమేష్ ఇంటిపై ఏసీబీ కోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-06-06T17:50:33+05:30 IST
లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) ఇంటిపై ఏసీబీ (ACB) కోర్టులో విచారణ జరిగింది.
విజయవాడ: లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) ఇంటిపై ఏసీబీ (ACB) కోర్టులో విచారణ జరిగింది. లింగమనేని ఇంటి జప్తుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు పేర్కొంది. కోర్టు అటాచ్‌మెంట్‌కు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాల విషయాన్ని అభ్యర్థించిన అధికారిని విచారించాల్సిన అవసరం ఉందని ఏసీబీ కోర్టు పేర్కొంది. మే 18న నోటీస్ ఆర్డర్ చేసినందున లింగమనేనికి దస్త్రాలు ఇవ్వాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 16కు కోర్టు వాయిదా వేసింది.