Inter: ఏపీలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2023-06-13T19:43:41+05:30 IST

ఏపీలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి.

Inter: ఏపీలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 37.77 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్‌ సెకండియర్‌లో 42.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. రీ-వెరిఫికేషన్‌కు ఈనెల 23 తుది గడువు ప్రకటించారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ కలిపి 4 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

Updated Date - 2023-06-13T19:43:41+05:30 IST