AP News: ‘అప్పట్లో జగన్ మాట బలంగా నమ్మాను’

ABN , First Publish Date - 2023-05-21T16:10:39+05:30 IST

సీపీఎస్ రద్దు చేయాలని లక్ష్యం చేరే వరకు పోరాటం చేస్తామని ఉద్యోగులంతా సంకల్పం తీసుకోవాలని ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

AP News: ‘అప్పట్లో జగన్ మాట బలంగా నమ్మాను’

విజయవాడ: సీపీఎస్ (CCS) రద్దు చేయాలని లక్ష్యం చేరే వరకు పోరాటం చేస్తామని ఉద్యోగులంతా సంకల్పం తీసుకోవాలని ఏపీజీఈఏ (apgea) అధ్యక్షుడు సూర్యనారాయణ (suryanarayana) పిలుపునిచ్చారు. తాము జెండా ఎత్తుతుంటే చాలు.. ఇతర ఉద్యోగ సంఘాల జెండాలు పైకి లేస్తాయన్నారు. తాము సీపీఎస్‌పై పోరాట కార్యాచరణ ప్రకటించగానే మిగిలిన సంఘాలు సీపీఎస్‌పై మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో సీపీఎస్ రద్దుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం హడావుడి చేస్తుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని 2014లో అప్పటి ప్రభుత్వమే స్పాన్సర్ చేసిందని ఆయన గుర్తుచేశారు. సీపీఎస్ రద్దు కోసం అప్పట్లో ఎపీఎన్జీవో సంఘం ప్రయత్నించలేదన్నారు. సీపీఎస్‌ను అడ్డుకోకుండా ఉద్యోగులను ఎపీఎన్జీవో సంఘం మోసం చేసిందని మండిపడ్డారు. అలాంటి సంఘాలను మళ్లీ నమ్మి మోసపోవద్దన్నారు. వ్యక్తిగత గుర్తింపు కోసం గతంలో ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని ముద్దులు పెడుతూ ఒకరు పాదయాత్రలో తిరిగి మాటిచ్చారని సీఎం ను ఉద్దేశించి అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నిజంగా సీపీఎస్‌ను జగన్ రద్దు చేస్తారని తాను బలంగా నమ్మానని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-21T16:10:39+05:30 IST