AP News: సీఎంతో పాటు మంత్రిని ఉతికారేసిన ఆచంట సునీత

ABN , First Publish Date - 2023-04-04T17:58:25+05:30 IST

డ్వాక్రామహిళలు అన్నదానిలో తప్పేముందో మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు (Dharmana Prasada Rao) చెప్పాలని టీడీపీ (TDP) అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత (Achanta sunitha) డిమాండ్ చేశారు.

AP News: సీఎంతో పాటు మంత్రిని ఉతికారేసిన ఆచంట సునీత

అమరావతి: డ్వాక్రామహిళలు అన్నదానిలో తప్పేముందో మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు (Dharmana Prasada Rao) చెప్పాలని టీడీపీ (TDP) అంగన్ వాడీ, డ్వాక్రాసాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత (Achanta sunitha) డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళల్ని పనికిమాలిన వాళ్లు అన్న మంత్రే పెద్దపనికి మాలినవాడని ఎద్దేవా చేశారు. వైసీపీ (YCP) సర్పంచ్‌లు మొదలు మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ మహిళల్ని అవమానించారని, ఇప్పటికీ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) తనసభకు వచ్చిన మహిళలు నల్లదుస్తులు వేసుకున్నారని అవి తీయించాడని, వారు బాత్రూమ్‌లకు వెళ్లకుండా అడ్డుకొని డైపర్లు వేసుకోవాలంటూ ఉచిత సలహాలిచ్చి ఘోరంగా అవమానించాడని గుర్తుచేశారు. రాజధాని మహిళల విషయంలో, అన్నెంపున్నెం ఎరుగని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల విషయంలో జగన్ ఎంత కర్కశంగా ప్రవర్తించాడో చూశామన్నారు. రాజధాని మహిళల్ని మగ పోలీసులతో పాశవికంగా కొట్టించడమేనా జగన్‌కు ఉన్న మహిళాభిమానం? అని ఆమె ప్రశ్నించారు. వైసీపీ కామాంధులు ఆడబిడ్డల మానప్రాణాలు హరిస్తున్నా ఏమీ పట్టనట్టు మొద్దునిద్రపోవడమేనా జగన్‌కు వారిపై ఉన్న ప్రేమాభిమానాలు? అని ఘాటుగా ప్రశ్నించారు. 4 విడతల్లో డ్వాక్రారుణాలు అన్నీ మాఫీ చేస్తానన్న జగన్ చచ్చీచెడి 3 విడత మాఫీ సొమ్ముని మార్చిలో విడుదలచేశాడని విమర్శించారు. మహిళలకేమో ఖాళీ చెక్కులిచ్చాడన్నారు. 4 వ విడత రుణమాఫీసొమ్ము ఇస్తాడనే నమ్మకం లేదన్నారు.

కాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) హాట్ వ్యాఖ్యలు చేశారు. పథకాలకు సీఎం జగన్ (CM Jagan) ఇంట్లోది ఇస్తున్నారా అని కొంతమంది మహిళలు అంటున్నారని, ఎవరైనా ఇంట్లోది ఇస్తామంటే వారి ఇంటికి వెళదామని వ్యాఖ్యానించారు. పథకాల డబ్బులు తీసుకుని కూడా సంస్కారవంతమైన మాట రాకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని మరలా గెలిపించకపోతే మీ రెండు చేతులు మీరు నరుక్కున్నట్టేనన్నారు.

తాను గెలువక పోతే వచ్చే నష్టం ఏం లేదని, తాను పోటీ చేయడం, గెలవడం ఇష్యూ కాదన్నారు. గెలిస్తే మీ చాకిరీ చేస్తా... ఓడిపోతే మీ స్నేహితుడిగా ఉంటానన్నారు. మీ వైపు ఆలోచించే ప్రభుత్వాన్ని మీరు గెలిపించుకోండని సూచించారు. తాను కొన్ని సిద్దాంతాలు, భావాజాలలుపై పనిచేస్తానని చెప్పారు. తన పదవితో తనకు సంబంధం లేదన్నారు. నలబై ఏళ్లుగా తన గౌరవాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు... కానీ, ఇంచీ కూడా తగ్గలేదన్నారు. చెప్పడానికి ఏం లేక నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులతో సరుకుల ధరలపై ఇతర రాష్ట్రాల్లో వాకాబు చేయండని సూచించారు.

Updated Date - 2023-04-04T17:58:29+05:30 IST