Day 4 - AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-09-26T09:47:14+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారం సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

Day 4 - AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) నాలుగవ రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈరోజు ఉన్నత విద్యా మండలి తరపున జవహర్ లాల్ టెక్నికల్ యూనివర్సిటీస్ సవరణ చట్టం 2021ను మంత్రి బొత్స (Minister Botsa satyanarayana) సభ ముందు ఉంచనున్నారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 22వ వార్షిక నివేదికను 2021- 22 సంవత్సరానికి గాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) సభ ముందుంచనున్నారు. అలాగే నేడు పలు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ సివిల్ కోర్టు సవరణ బిల్లు 2023ను సీఎం జగన్ (CM Jagan) సభ ముందు ఉంచి ఆమోదం పొందనున్నారు. నేడు రెండు స్వల్పకాలిక చర్చలకు సభలో సమయం కేటాయించనున్నారు. వ్యవసాయ శాఖలో అభివృద్ధి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో అవినీతిపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అటు శాసనమండలిలోనూ ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందు ఉంచి.. ఆమోదింపచేసుకోనుంది. శాసనమండలిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో అవినీతి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.

Updated Date - 2023-09-26T09:47:23+05:30 IST