ప్రకాష్‌రెడ్డీ.. కులరాజకీయాలు మానుకో

ABN, First Publish Date - 2023-12-08T23:47:18+05:30 IST

అబద్దాల హామీలు, కుల రాజకీయాలతో గత ఎన్నికల్లో గెలిచావ్‌.. ఇప్పుడు ఓటమి భయం మళ్లీ ఆ నీచ కుట్రలకు పాల్పడుతున్నావ్‌. అందులో భాగంగానే వాల్మీకు లను దొంగలుగా చిత్రీకరిస్తున్నావ్‌..’ అని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు

ధర్మవరంరూరల్‌, డిసెంబరు 8: అబద్దాల హామీలు, కుల రాజకీయాలతో గత ఎన్నికల్లో గెలిచావ్‌.. ఇప్పుడు ఓటమి భయం మళ్లీ ఆ నీచ కుట్రలకు పాల్పడుతున్నావ్‌. అందులో భాగంగానే వాల్మీకు లను దొంగలుగా చిత్రీకరిస్తున్నావ్‌..’ అని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కనగానపల్లిలో నిర్వహించిన బాబుష్యూరిటీ--భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వాల్మీకికి చెందిన ఓ యువకుడ్ని మార్ఫింగ్‌ ఫొటోలతో దొంగతనం నెపం మోపేందుకు యత్నిస్తున్నారన్నారు. వాల్మీకులు దొంగల్లా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు. అన్నికులాలు వారు ప్రతి పార్టీలోనూ ఉంటారని, అందరిని సమానంగా చూడాలని అన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న కులరాజకీయాలను ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వాస్తవాలను గ్రహించాలన్నారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి నెట్టెం వెంకటేష్‌, కన్వీనర్‌ యాతం పోతలయ్య, క్లస్టర్‌ ఇనఛార్జ్‌ సుధాకర్‌ చౌదరి, ఎంపీటీసీ బిల్లే భాస్కర్‌, టీసీ సుబ్రమణ్యం, తెలుగు యువత బట్టా సురేష్‌చౌదరి, సర్పంచ సోమర చంద్రశేఖర్‌, పూజారి రాజాకృష్ణ, సరిపూటి బాలయ్య, మాదినేని సుబ్బయ్య, గ్రామాధ్యక్షుడు కసుమూర్తి వెంకటేష్‌, బిల్లే దాము, మాజీ ఎంపీటీసీ పోతలయ్య, లక్ష్మీనారాయణ, అంకే వన్నూరప్ప, చల్లాబాలకృష్ణ, బట్టాసుబ్రమణ్యం పాల్గొన్నారు.

Updated at - 2023-12-08T23:47:19+05:30