Anakapally: బస్సు డ్రైవర్‌ను కత్తితో బెదిరించి ఏం చేశాడో తెలుసా?

ABN , First Publish Date - 2023-02-24T14:53:43+05:30 IST

లవర్ కోసం కత్తితో హల్చల్ చేశాడో యువకుడు . ప్రేయసిని బస్సు దించేందుకు ఏకంగా బస్సు డ్రైవర్ ను కత్తితో బెదిరించాడు.

Anakapally: బస్సు డ్రైవర్‌ను కత్తితో బెదిరించి ఏం చేశాడో తెలుసా?

అనకాపల్లి: లవర్ కోసం కత్తితో హల్చల్ చేశాడో యువకుడు. ప్రేయసిని బస్సు దించేందుకు ఏకంగా బస్సు డ్రైవర్ ను కత్తితో బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. కసికోట మండలం తేగాడ గ్రామానికి చెందిన గడసాల శివసాయి అనే యువకుడు లవర్ కోసం బస్సు డ్రైవర్ ను బెదిరించాడు. బయ్యవరం వద్ద ప్రైవేట్ కాలేజీ బస్సులో ఉన్న తన లవర్ ను కిందికి దించాలంటూ బైక్ అడ్డంగా పెట్టాడు. ఇదేంటని అడిగిన డ్రైవర్ ను కత్తితో బెదిరించాడు. బస్సు డ్రైవర్ కసింకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా శివసాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

Updated Date - 2023-02-24T15:02:34+05:30 IST