TS News: బైక్‌పై డేంజరస్ డ్రైవింగ్... పోలీసుల సీరియస్

ABN , First Publish Date - 2022-12-10T13:39:26+05:30 IST

వరంగల్ - కరీంనగర్ హైవేపై ముగ్గురు యువకుల హల్‌చల్ చేశారు.

TS News: బైక్‌పై డేంజరస్ డ్రైవింగ్... పోలీసుల సీరియస్

హనుమకొండ: వరంగల్ - కరీంనగర్ హైవేపై ముగ్గురు యువకుల హల్‌చల్ చేశారు. బీమారం మెయిన్ రోడ్డుపై బైక్‌తో యువకులు సర్కస్ ఫీట్లు చేశారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యువకుల డేంజరస్ డ్రైవింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డేంజరస్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు యువకులపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కేయూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బండి నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సూర రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజును కేయూ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-12-10T13:39:27+05:30 IST