Vinay Bhaskar: మీ కుటుంబం గొడవలు ఉంటే అక్కడ తేల్చుకో... షర్మిలపై వినయ్ భాస్కర్ ఫైర్

ABN , First Publish Date - 2022-12-01T12:49:00+05:30 IST

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు.

Vinay Bhaskar: మీ కుటుంబం గొడవలు ఉంటే అక్కడ తేల్చుకో... షర్మిలపై వినయ్ భాస్కర్ ఫైర్

వరంగల్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YSRTP Chief YS Sharmila)పై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...షర్మిలకు తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘మీ కుటుంబం గొడవలు ఉంటే అక్కడ తేల్చుకో’’ అంటూ హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ డైరెక్షన్‌లో షర్మిల నడుస్తోందని ఆరోపించారు. బ్యాండేజ్‌లు వేసుకోని డిబేట్‌లో పాల్గొన్నారని... షర్మిల నటనకు అవార్డు ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో హమీలపై మాట్లాడి... అవీ నేరవేర్చే దిశగా బీజేపీ నాయకులు పనిచేయాలని వినయ్ భాస్కర్ హితవుపలికారు.

Updated Date - 2022-12-01T12:49:01+05:30 IST