Munugode: మునుగోడులో టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2022-11-14T15:37:30+05:30 IST

జిల్లాలోని మునుగోడు (Munugode) లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ (Trs)విజయోత్సవ ర్యాలీ మునుగోడుకు చేరడంతో...

Munugode: మునుగోడులో టెన్షన్ టెన్షన్

నల్లగొండ: జిల్లాలోని మునుగోడు (Munugode) లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ (Trs)విజయోత్సవ ర్యాలీ మునుగోడుకు చేరడంతో... అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల (Mla Kusukuntla Prabhakar Reddy) పూలమాలలు వేశారు. దీంతో గొల్ల కురుమలకు మద్దతుగా రాజగోపాల్‌రెడ్డి ఆందోళనకు దిగారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు రాజగోపాల్‌ (Rajgopal)అక్కడికి వచ్చారు. గొల్ల కురుమల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేసి వెనక్కి తీసుకుందని నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశారు. దాంతో అక్కడ పరిస్థితి టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Updated Date - 2022-11-14T15:37:34+05:30 IST