TS News: దైవదర్శనం టికెట్ పేరుతో టీచర్‌కు టోకరా
ABN , First Publish Date - 2022-12-13T09:03:07+05:30 IST
దైవ దర్శనం టికెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు టీచర్‌కు టోకరా వేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
కామారెడ్డి: దైవ దర్శనం టికెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు టీచర్‌కు టోకరా వేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మికి దైవ దర్శనం టికెట్ పేరిట కేటుగాళ్లు రూ.18,240లకు టోకరా వేశారు. కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి హెలికాప్టర్ టికెట్ బుక్ చేయడనికి ఆన్‌లైన్‌లో దొరికిన నంబర్‌కు ఫోన్ చేయగా టికెట్ బుక్ చేస్తామని ఉపాధ్యాయురాలిని మోసం చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో అనుమానం వచ్చిన విజయలక్ష్మి... దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.