TS News: విద్యార్థినిపై లైంగిక దాడికి యువకుడి యత్నం

ABN , First Publish Date - 2022-11-30T14:56:33+05:30 IST

జిల్లాలోని నిడమనూరులో దారుణం చోటు చేసుకుంది.

TS News: విద్యార్థినిపై లైంగిక దాడికి యువకుడి యత్నం

నల్లగొండ: జిల్లాలోని నిడమనూరులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిని అక్కడకు చేరుకున్న ఉపాధ్యాయులు యువకుడిని పట్టుకోడానికి వెళ్లగా వారిపై దాడికి యత్నించారు. అనంతరం యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పాఠశాల పక్కన ఉన్న దుకాణం వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-11-30T14:56:34+05:30 IST