By Election: మునుగోడు పోలింగ్ కోసం మొదలైన ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-11-02T11:03:57+05:30 IST

నల్గొండ: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.

By Election: మునుగోడు పోలింగ్ కోసం మొదలైన ఏర్పాట్లు

నల్గొండ: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. అధికారులు పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం అరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. 298 పోలిగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 2,500 మంది స్టేట్ పోలీసులు, 15 కంపెనీల బలగాల సెంట్రల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మునుగోడులో పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లకు కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడీలు పంపిణీ చేశారు.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, యాభై ఫ్లైయింగ్ స్కాడ్ టీంలు, 199 మైక్రో అబ్జర్వర్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. 3,366 పోలింగ్ సిబ్బందిని నియమించారు. 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆదివారం (6వ తేదీ) కౌంటింగ్ జరగనుంది.

Updated Date - 2022-11-02T11:04:00+05:30 IST