Munugode: మునుగోడులో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగం: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-11-03T18:47:58+05:30 IST

మునుగోడు (Munugode)లో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ధ్వజమెత్తారు.

Munugode: మునుగోడులో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగం: బండి సంజయ్‌
Bandi Sanjay

హైదరాబాద్: మునుగోడు (Munugode)లో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట వినాలంటూ అధికారులు టీఆర్ఎస్‌ నేతలు బెదిరించారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను టీఆర్ఎస్‌ నేతలు నాశనం చేశారని దుయ్యబట్టారు. అనేకసార్లు టీఆర్‌ఎస్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. టీఆర్ఎస్‌కు ఎన్నికల సంఘం జేబుసంస్థలా మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్‌ దౌర్జన్యాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, సీఈవో వికాస్‌రాజ్‌ వల్ల ఏం కాదని తేలిపోయిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీనే గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-03T18:47:59+05:30 IST