Tummala Nageshwar Rao: పాలేరును అభివృద్ధి చేసింది ఓట్ల కోసం కాదు
ABN , First Publish Date - 2022-12-26T15:22:23+05:30 IST
పాలేరును అభివృద్ధి చేసింది ఓట్ల కోసమో, రాజకీయం కోసమో కాదని...
ఖమ్మం: పాలేరును అభివృద్ధి చేసింది ఓట్ల కోసమో, రాజకీయం కోసమో కాదని... ప్రజల కష్టాలు తీర్చేందుకే అభివృద్ధి చేసినట్లు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Former Minister Tummala Nageshwar Rao) తెలిపారు. పాలేరులో ప్రతి రైతు ఆనందంగా ఉండాలనేదే తన కోరికన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రహదారి నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఆగిపోయిన ఎస్సార్‌ఎస్పీ పనులు కూడా ప్రారంభం కానున్నాయని చెప్పారు. కూసుమంచిలో గతంలోనే 7 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేయించామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.