TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ కేసు విచారణ.. నిందితుల వాయిస్‌ శాంపిల్స్‌ సేకరణ

ABN , First Publish Date - 2022-11-11T17:45:24+05:30 IST

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad Farm house) కేసు విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆఫీస్‌కు సీపీ సీవీ ఆనంద్‌ (CP CV Anand) వచ్చారు. నిందితుల విచారణను సీపీ పర్యవేక్షిస్తున్నారు.

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ కేసు విచారణ.. నిందితుల వాయిస్‌ శాంపిల్స్‌ సేకరణ

హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad Farm house) కేసు విచారణ కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆఫీస్‌కు సీపీ సీవీ ఆనంద్‌ (CP CV Anand) వచ్చారు. నిందితుల విచారణను సీపీ పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు నిందితుల వాయిస్‌ శాంపిల్స్‌ అధికారులు తీసుకున్నారు. నేటితో ముగ్గురు నిందితుల కస్టడీ (Custody) ముగియనుంది. ‘‘ఎవరి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపారు? డీల్‌ వెనక ఉన్నదెవరు? నలుగురు టీఆర్‌ఎస్‌ (TRS) ఎమ్మెల్యేలను పరిచయం చేసిందెవరు? అసలు మీ ముగ్గురికి ఎలా పరిచయం? మొత్తం ఎంత మంది ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారు?? డీల్‌ కుదిరితే.. వందల కోట్ల రూపాయలు ఇచ్చేదెవరు? డీల్‌ సక్సెస్‌ అయితే.. మీకు మిగిలేదెంత??’’ అంటూ మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) గురువారం ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను.. ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతితో గురువారం ఉదయం సిట్‌ తన కస్టడీకి తీసుకుంది. చంచల్‌గూడ జైలు నుంచి భద్రత నడుమ ఆ ముగ్గురిని రాజేంద్రనగర్‌ ఠాణాకు తరలించింది. సైబరాబాద్‌ డీసీపీ(నేరాలు) కల్మేశ్వర్‌ సింగన్వార్‌, శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీరెడ్డి ఆ ముగ్గురిని వేర్వేరు గదుల్లో.. వారి తరఫు న్యాయవాదుల సమక్షంలో సుమారు 7 గంటలపాటు విచారించారు.

Updated Date - 2022-11-11T17:45:25+05:30 IST