Revanth Reddy: హామీలు అమలు చేయమంటే అరెస్ట్ చేయడమేంటి?

ABN , First Publish Date - 2022-11-28T15:38:33+05:30 IST

దామరచర్ల ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Telangana PCC President Revanth Reddy) హెచ్చరించారు

Revanth Reddy: హామీలు అమలు చేయమంటే అరెస్ట్ చేయడమేంటి?

హైదరాబాద్: దామరచర్ల ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Telangana PCC President Revanth Reddy) హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం(Cm kcr) వస్తుంటే ప్రజా ప్రతినిధులను అరెస్టులు చేస్తారా..? హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేయడం ఏమిటి? కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామిక చర్య... కాంగ్రెస్ నాయకుల(Congress leaders) అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దామరచర్లకు ముఖ్యమంత్రి వస్తే గతంలో ఆయన ఇచ్చిన హామీ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. భూ నిర్వాసితులకు పరిహారాలు, ఇతర సౌకర్యాలు, స్థానికులకు ఉద్యోగాలు, పోడు భూములకు పట్టాలు, జాబ్ కార్డ్స్ గురించి కాంగ్రెస్ నాయకులు సీఎంను ఆడిగారు. డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం ముఖ్యమంత్రిని అడిగేందుకు వెళ్లడం నేరమా? డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్‌ను, ఆడివిదేవిపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ ప్రాంత నాయకులను అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారు. వారిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-28T15:38:34+05:30 IST