#TDPJayahoBC: దేశవ్యాప్తంగా టీడీపీ జయహో బీసీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్

ABN , First Publish Date - 2022-12-07T09:18:19+05:30 IST

టీడీపీ జయహో బీసీ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

#TDPJayahoBC: దేశవ్యాప్తంగా  టీడీపీ జయహో బీసీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్

హైదరాబాద్: టీడీపీ జయహో బీసీ హ్యాష్ ట్యాగ్ (TDP Jayaho BC hashtag trending on Twitter ) ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలు, వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ #TDPJayahoBC హ్యాష్ ట్యాగ్‌ను ఐటీడీపీ ట్రెండ్ చేస్తోంది. దీంతో ముందుకు వచ్చిన బీసీ వర్గాలు, బీసీ యువత... తమకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ట్వీట్లు, కామెంట్స్ చేస్తున్నారు. బీసీలకు టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా #TDPJayahoBC హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Updated Date - 2022-12-07T09:24:11+05:30 IST