MLAs Purchase Caseపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-12-16T11:56:37+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై శుక్రవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది.

MLAs Purchase Caseపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు(MLAs Purchase Case)పై శుక్రవారం ఉదయం హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. సీఎం మీడియా సమావేశంలో ఫామ్ హౌస్ వీడియోలను బయట పెట్టడంపై పిటీషనర్లు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ వీడియోలు, కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. సీఎం మీడియా సమావేశం సీడీలు ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటీషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సమర్పించినప్పుడు 65 బి ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికెట్ ఎందుకు సమర్పించలేదని సిట్ తరుపు న్యాయవాది వాదించారు. తమకు కొంత సమయం కావాలని పిటిషనర్ కోరగా... న్యాయస్థానం ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు సమయం ఇచ్చింది. కేసు తదుపరి విచారణను హైకోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

Updated Date - 2022-12-16T11:57:14+05:30 IST