TS News: హైకోర్టు ఆదేశాలతో సభా స్థలాన్ని మార్చిన బీజేపీ

ABN , First Publish Date - 2022-11-29T11:11:21+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం బైంసా (Bainsa) నుంచి ప్రారంభం కానుంది.

TS News: హైకోర్టు ఆదేశాలతో సభా స్థలాన్ని మార్చిన బీజేపీ

నిర్మల్ జిల్లా (Nirmal Dist.): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం బైంసా (Bainsa) నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం బైంసా సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైకోర్టు (High Court) ఆదేశాలతో బీజేపీ నేతలు సభా స్థలాన్ని బైంసాకు మూడు కి.మీ. దూరంలో మార్చారు. ఈ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పడ్నవీస్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.

సభ తర్వాత షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ యాత్ర కొనసాగనుంది.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో నిన్న (సోమవారం) విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. బహిరంగ సభకు మాత్రం షరతులు విధించింది. బైంసాకు మూడు కి.మీ. దూరంలో నిర్వహించుకోవాలని సూచించింది. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హైకోర్టు పోలీసులకు సూచించింది.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ విడత యాత్రను సోమవారం నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ నిర్ణయించారు. పాదయాత్ర అనుమతి కోసం ఆయన పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత యాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు.. చివరి నిమిషంలో అనుమతి రద్దు చేశారు. దీంతో బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది.

Updated Date - 2022-11-29T11:11:27+05:30 IST