Year End Sale: ఐఫోన్14పై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!.. ఊహించనంత తక్కువకే..

ABN , First Publish Date - 2022-12-27T17:43:45+05:30 IST

చూస్తుండగానే ప్రస్తుత ఏడాది 2022 ముగింపు (Year End2022) దశకు వచ్చేసింది. రోజుల వ్యవధిలోనే పాత ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది.

Year End Sale: ఐఫోన్14పై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!.. ఊహించనంత తక్కువకే..

న్యూఢిల్లీ: చూస్తుండగానే ప్రస్తుత ఏడాది 2022 ముగింపు (Year End2022) దశకు వచ్చేసింది. రోజుల వ్యవధిలోనే పాత ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. ఇక నూతన సంవత్సరం 2023కు (New Year 2023) స్వాగతం పలకడమే తరువాయి. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు ఔత్సాహిక యువత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చేదుజ్ఞాపకాలను పక్కనపెట్టి కొత్త ఏడాదిలోకి సంతోషంగా అడుగుపెట్టాలని భావిస్తున్నారు. మరి న్యూయర్ వేడుకల కోసం ఎదుచూస్తున్న ఔత్సాహికుల్లో మరింత ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ (Flipkart) ఐఫోన్14పై ఊరించే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

ఏడాది ముగింపు సేల్‌లో భాగంగా ఐఫోన్ 14పై (iPhone 14) ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. 2022లోనే విడుదలైన సరికొత్త ఐఫోన్14 ప్రారంభ ధర రూ.79,900గా ఉండగా ఇదివరకెప్పుడూ లేనంత డిస్కౌంట్‌తో ఊరిస్తోంది. డిసెంబర్ 28(బుధవారం) వరకు మాత్రమే కొనసాగనున్న ఇయర్ ఎండ్ సేల్‌లో కేవలం రూ.56,990కే ఫోన్‌ను దక్కించుకునే అవకాశాన్ని కల్పించింది. ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌పై ఇప్పటికే 3 శాతం డిస్కౌంట్‌ లభిస్తుండగా తాజాగా పాత ఫోన్ ఎక్స్చేంజీ ఆప్షన్ ద్వారా అదనంగా రూ.20,500 వరకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని అందిస్తోంది. అంటే ఐఫోన్14ను రూ.రూ.56,990కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే మీ పాత ఫోన్ కండీషన్, పనితీరు ఆధారంగా కొత్త ఫోన్‌పై డిస్కౌంట్ లభించనుంది. కాబట్టి ఐఫోన్ 14 కొనే ఉద్దేశ్యం ఉంటే ఈ ఆఫర్‌ ద్వారా కొంత డిస్కౌంట్ పొందే అవకాశం లభిస్తుంది.

ఇక ఐఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.1 - అంగుళాల డిస్‌ప్లే, లాక్‌స్ర్కీన్ కస్టమరైజేషన్, క్రాష్ డిటెక్షన్ వంటి ఇతర కొత్త ఫీచర్లతో ఐవోఎస్ 16తో లభిస్తోంది. 128జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోరేజీ వంటి మూడు వేరియెంట్లలో మార్కెట్‌లో లభ్యమవుతోంది. కాగా 2022 ఏడాది ముగింపు సందర్భంగా పలు పెద్ద కంపెనీలు ‘ఇయర్ ఎండ్ సేల్స్’కు (Year End Sale) సన్నద్ధమవుతున్నాయి.

Updated Date - 2022-12-27T18:22:48+05:30 IST