Black Friday Sale: సామ్‌సంగ్ క్రేజీ ఆఫర్స్.. రూ.10వేల లోపే 5G మొబైల్!

ABN , First Publish Date - 2022-11-24T10:57:23+05:30 IST

సామ్‌సంగ్ Black Friday Sales పేరుతో క్రేజీ ఆఫర్స్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గాడ్జెట్స్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. నేటి ఆర్ధరాత్రి నుంచే ఈ సేల్స్

Black Friday Sale: సామ్‌సంగ్ క్రేజీ ఆఫర్స్.. రూ.10వేల లోపే 5G మొబైల్!

ఇంటర్నెట్ డెస్క్: సామ్‌సంగ్ Black Friday Sales పేరుతో క్రేజీ ఆఫర్స్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గాడ్జెట్స్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. నేటి ఆర్ధరాత్రి నుంచే ఈ సేల్స్ మొదలవగా.. ఈ నెల 28 వరకు ఆఫర్స్ ఆందుబాటులో ఉండనున్నాయి. సామ్‌సంగ్ బ్రాండింగ్‌లో ఫోన్లు ఇతర గాడ్జెట్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్న వాళ్లు.. ఈ సేల్స్‌పై ఓ లుక్కైతే వేయవచ్చు. ఇక సేల్స్‌లో ఏ మొబైల్ ఎంతకు లభిస్తుందనే వివరాలను ఓసారి పరిశీలిస్తే..

Samsung Galaxy S22 మొబైల్ ధర ప్రస్తుతం రూ.85,999 ఉండగా.. సేల్స్‌లో రూ.62,999కే అందుబాటులో ఉంది. ఇక కొన్ని రకాల క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగిండం, సామ్‌సంగ్ యాప్ వెల్‌కమ్ ఓచర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ మొబైల్‌పై అదనంగా రూ.12000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే.. గెలాక్సీ ఎస్ 22అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 మొబైల్స్‌తోపాటు సామ్‌సాంగ్ వాచ్‌ను వరుసగా రూ.99,999 మరియు రూ.80,999లకే అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ రేంజ్‌లో రూ.10వేల లోపే 5G మొబైల్ కోసం చూస్తున్న వాళ్లు.. గెలాక్సీ ఎం13పై ఓ లుక్కైతే వేయవచ్చు. గెలాక్సీ ఎం13 బేస్ వేరియంట్ రూ.9,149కే అందుబాటులో ఉంది. ఇక గెలాక్సీ ఎం33 5G మొబైల్ కూడా ఈ సేల్స్‌లో రూ.14,649కే అందుబాటులో ఉంది. వీటితోపాటు మరెన్నో ఫోన్లు, ఇతర ఉపకరణాలపై సామ్‌సాంగ్ డిస్కౌంట్లను ప్రకటించింది.

Updated Date - 2022-11-24T20:29:51+05:30 IST

Read more