Overcome Smartphone Addiction : స్మార్ట్‌ఫోన్ అటాచ్‌మెంట్ తగ్గించుకోండిలా..!

ABN , First Publish Date - 2022-11-22T14:39:37+05:30 IST

మానవ మనస్తత్వాలను ప్రభావితం చేయడం, నకిలీ వార్తలను వైరల్ చేయడం, ఇవే పనిగా పనిచేస్తున్నాయి ఫోన్స్

Overcome Smartphone Addiction : స్మార్ట్‌ఫోన్ అటాచ్‌మెంట్ తగ్గించుకోండిలా..!
Overcome phone addiction

స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటానికి మొదలైన స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ద్వేషాన్ని రెచ్చగొట్టడం, మానవ మనస్తత్వాలను ప్రభావితం చేయడం, నకిలీ వార్తలను వైరల్ చేయడం, ఇవే పనిగా పనిచేస్తున్నాయి ఫోన్స్. అయినా సరే మన స్క్రీన్ టైం తగ్గడంలేదు. ధ్వేషాన్ని, అనవసరమైన ఒత్తిడిని కొని తెచ్చుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఎంతవరకూ కట్టడి చేయచ్చు.. అదెలాగో చూద్దాం.

స్మార్ట్‌ఫోన్‌లకు ఇచ్చే సమయాన్ని తగ్గించుకోవడానికి మార్గాలను వెతకాలి.

మనలో చాలా మందికి ఫోన్ ఒక వ్యసనం, ఆపకుండా స్కోలింగ్ చేస్తూ ఫోన్ కి అంకితం అయిపోతూ ఉంటాం. దీనితో సమయం, మేధస్సు రెండూ వ్యర్థం చేసుకుంటున్నామనే ఆలోచనను రానీయడం లేదు. అనవసరంగా ఫోన్ పదే పదే చూసేవారిలో ఆలోచించే గుణం నెమ్మదిగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. అసలు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి.

నోటిఫికేషన్‌లను స్విచ్ ఆఫ్ చేయండి:

నోటిఫికేషన్‌లను స్విచ్ ఆఫ్ చేయడం అత్యంత సాధారణ పరిష్కారాలలో ఒకటి. చాలా యాప్‌లు, షాపింగ్ సైట్‌లు, సోషల్ మీడియాలు గతంలో చూసిన పోస్ట్‌లు, ప్రొడక్ట్‌లను పోలి ఉండే కొత్త కంటెంట్, ప్రోడక్ట్ ఆప్షన్‌లతో యాప్‌తో కనెక్ట్ చేయడానికి పుష్ నోటిఫికేషన్‌ను పంపుతూనే ఉంటాయి. దీనికి మార్గం ఏమిటంటే, ఏదైనా యాప్ నుండి పుష్ నోటిఫికేషన్‌లను అంగీకరించకపోవడం మంచిది.

Google సర్చ్ లో వేరే బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారా.

సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ నిపుణులు గూగుల్ కి మన ప్రతి విషయం మీద సమాచారం ఉంటుందని చెపుతారు, లొకేషన్, బ్యాంక్ బ్యాలెన్స్, ఖర్చు విధానాలు, బ్రౌజర్ బుక్‌మార్క్‌లు, యూట్యూబ్ హిస్టరీ, ఇలా అన్ని పరిచయాలు, అన్ని మీడియా ఫోటో, వీడియోలు మనం ఆలోచించగలిగే ప్రతిదాన్ని సమాచారంగా కలిగి ఉంది. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

పొడవైన ఫోన్ పాస్‌వర్డ్‌ను పెట్టుకోండి

పెద్దవైన, కష్టమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం వల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఫోన్ వంక చూసుకోవడం, తనిఖీ చేసుకోవడం అనేది తగ్గుతుంది. ప్యాటర్న్, పిన్, ఫేస్ అన్‌లాక్‌ని ఉపయోగించడం ఆపివేయండి, ఇది ఫోన్‌ను మళ్లీ మళ్లీ స్క్రోల్ చేయడానికి అన్‌లాక్ చేయకుండా చేస్తుంది.

మీ స్క్రీన్ సమయాన్ని చెక్ చేసుకోండి.

ఫోన్ వినియోగాన్ని నియంత్రించడానికి మీ స్క్రీన్ సమయాన్ని గమనించడం ముఖ్యం. మామూలుగా స్క్రీన్‌పై ఎంత సమయం గడుపుతున్నారో ఏ ఏ యాప్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారో చెక్ చేసుకోవడం మంచిది. ఈ యాప్‌లు Facebook, Instagram వంటి సోషల్ నెట్‌వర్క్‌లైతే, ఆ యాప్‌లను తొలగించి, మొబైల్ ఉపయోగించడం మొదలు పెట్టండి.

అనవసరమైన యాప్‌లను తొలగించండి.

అనవసరమైన యాప్‌లను ఆ సమయానికి వాడటం పూర్తయిన తర్వాత డౌన్‌లోడ్‌లను అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి లేదా తీసేయండి. పిల్లలకు అందుబాటులో ఫోన్ ఉండకుండా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫోన్ వాడకం దానంతట అదే తగ్గుతుంది. కొత్త ఆలోచనలు పుడతాయి. వ్యాపకాలు ఏర్పడతాయి. పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ ఆటలు మాని తోటి పిల్లలతో ఆడుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు.

Updated Date - 2022-11-22T14:53:53+05:30 IST

Read more