Apple: ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

ABN , First Publish Date - 2022-11-05T17:32:09+05:30 IST

అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సంస్థ ఆపిల్ (Apple) తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోన్ జియోమార్ట్ ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తుందని సంస్థ తెలిపింది.

Apple:  ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
iPhone 14

హైదరాబాద్: అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సంస్థ ఆపిల్ (Apple) తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోన్ జియోమార్ట్ ఆన్‌లైన్ స్టోర్లలో లభిస్తుందని సంస్థ తెలిపింది. భారత మార్కెట్‌లో సెప్టెంబర్ నెలలో 'ఫార్ అవుట్' ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో ఐఫోన్ 14 (iPhone 14) ప్రారంభ ధర రూ. 79,900 ఉంటుంది. ఈ ఫోన్‌ జియోమార్ట్ ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 77,900 లభిస్తుందని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు అదనంగా రూ. 5 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుందని జియోమార్ట్ తెలిపింది. సెప్టెంబర్ 7న జరిగిన ఫార్ అవుడ్ ఈవెంట్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు ఆపిల్ సంస్థ పేర్కొంది. 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 14 ధర రూ. 89,900, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 14 ధర రూ.1,09,900 ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2022-11-05T17:33:51+05:30 IST