Virat Kohli: టీ20 క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ

ABN , First Publish Date - 2022-11-10T16:50:54+05:30 IST

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ (T20 Cricket) చరిత్రలో

Virat Kohli: టీ20 క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ

అడిలైడ్: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ (T20 Cricket) చరిత్రలో 4 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో అడిలైడ్‌లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనె సాధించిన 1,016 పరుగులను అధిగమించాడు.

తాజాగా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 4 వేల పరుగుల మైలు రాయిని చేరుకునేందుకు కోహ్లీకి 42 పరుగులు అవసరం కాగా, ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేయడంతో రికార్డు అతడి సొంతమైంది. 15వ ఓవర్‌లో అదిల్ రషీద్ బౌలింగులో ఫోర్ బాది కోహ్లీ రికార్డును కైవసం చేసుకున్నాడు. కోహ్లీ 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటు’ అవార్డు అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ కోహ్లీ అత్యధిక పరుగులతో అందరికంటే ముందున్నాడు. ఈ జాబితాలో టీమిండియా సారథి రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్, బాబర్ ఆజం, పాల్ స్టిర్లింగ్ కంటే కోహ్లీ చాలా ముందున్నాడు. ఈ ప్రపంచకప్‌లోనూ ఇప్పటి వరకు కోహ్లీదే అత్యధిక స్కోరు. ఆరు మ్యాచుల్లో కోహ్లీ 270 పరుగులు చేశాడు.

Updated Date - 2022-11-10T16:52:07+05:30 IST