Team India: సఫారీ బ్యాటర్లను కట్టడి చేస్తున్న టీమిండియా బౌలర్లు
ABN , First Publish Date - 2022-10-30T19:27:39+05:30 IST
టీ20 ప్రపంచకప్ సూపర్-12 మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లను భారత బౌలర్లు అద్భుతంగా కట్టి చేస్తున్నారు. దీంతో పరుగుల కోసం బ్యాటర్లు చెమటోడుస్తున్నారు
పెర్త్: టీ20 ప్రపంచకప్ సూపర్-12 మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లను భారత బౌలర్లు అద్భుతంగా కట్టి చేస్తున్నారు. దీంతో పరుగుల కోసం బ్యాటర్లు చెమటోడుస్తున్నారు. టీమిండియా బౌలర్లు పొదుపుగా బౌలింగు చేస్తుండడంతో సఫారీ స్కోరు బోర్డు నత్తనడకన సాగుతోంది. 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత 24 పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (10)ను కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మార్కరమ్, డేవిడ్ మిల్లర్ నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలో అతి జాగ్రత్తగా ఆడడంతో పరుగుల రాక కష్టమైంది. మరోవైపు, భారత బౌలర్లు కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బంతులు విసురుతుండడంతో పరుగులు రాబట్టుకోవడం బ్యాటర్లకు కష్టంగా మారింది. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిశాయి. సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మార్కరమ్ (36), మిల్లర్ (16) క్రీజులో ఉన్నారు.