South Africa: పాకిస్థాన్‌తో మ్యాచ్.. ఆదిలోనే సఫారీలకు ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2022-11-03T15:47:44+05:30 IST
పాకిస్థాన్ (Pakistan)తో జరుగుతున్న కీలక పోరులో దక్షిణాఫ్రికా (south africa)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
సిడ్నీ: పాకిస్థాన్ (Pakistan)తో జరుగుతున్న కీలక పోరులో దక్షిణాఫ్రికా (south africa)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ నిర్దేశించిన 186 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు తొలి ఓవర్ చివరి బంతికి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 16 పరుగుల వద్ద రిలీ రోసౌ (7)ను షహీన్ అఫ్రిది అవుట్ చేశాడు. ఐదు బంతులు ఆడిన క్వింటన్ డికాక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. షహీన్ వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో మహమ్మద్ హరీస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిశాయి. దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (51), షాదబ్ ఖాన్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. మహమ్మద్ హరీస్, నవాజ్ చెరో 28 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిక్ నోకియా 4 వికెట్లు పడగొట్టాడు.