వర్షం కారణంగా మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు.. సఫారీల లక్ష్యం ఎంతంటే?

ABN , First Publish Date - 2022-11-03T17:19:52+05:30 IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు

వర్షం కారణంగా మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు.. సఫారీల లక్ష్యం ఎంతంటే?

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలడంతో సఫారీల లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించారు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిన సమయానికి దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. చాలా సేపటి తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో ఓవర్లను కుదించారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. నాలుగు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. కాగా, పాకిస్థాన్ (Pakistan) నిర్దేశించిన 186 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా(South Africa)కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 16 పరుగులకే క్వింటన్ డికాక్ (0), రిలీ రోసౌ (7) అవుటయ్యారు.

అయితే, కెప్టెన్ తెంబా బవుమా, మార్కరమ్ కలిసి పాక్ బౌలర్లను కాసేపు అడ్డుకున్నారు. దీంతో పరుగులు రావడం ప్రారంభమైంది. ఇద్దరూ క్రీజులో పాతుకుపోతున్న సమయంలో సఫారీలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది. 65 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో తెంబా బవుమా అవుటయ్యాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 36 పరుగులు చేసి బవుమాను షాదాబ్ ఖాన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 66 పరుగుల వద్ద మార్కరమ్ (20)ను అవుట్ చేశాడు. దీంతో 64 పరుగులకే సౌతాఫ్రికా నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కోల్పోయింది.

Updated Date - 2022-11-03T17:19:54+05:30 IST