FIFA France in the final : అర్జెంటీనాతో అమీతుమీకి ఫ్రాన్స్‌ వచ్చేసింది

ABN , First Publish Date - 2022-12-16T00:26:01+05:30 IST

ఫేవరెట్‌ ఫ్రాన్స్‌.. అండర్‌ డాగ్‌ మొరాకో వరల్డ్‌కప్‌ కలను భగ్నం చేసింది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ఫ్రాన్స్‌ 2-0తో మొరాకోను ఓడించి.. వరుసగా రెండోసారి

FIFA France in the final : అర్జెంటీనాతో అమీతుమీకి ఫ్రాన్స్‌ వచ్చేసింది
గోల్‌ కొట్టిన హెర్నాండెజ్‌తో గిరోర్డ్‌ ఆనందం

వరుసగా రెండోసారి ఫైనల్లో ఫ్రాన్స్‌

సెమీస్‌లో 2-0తో మొరాకోపై విజయం

డిఫెండింగ్‌ చాంప్‌ ఫ్రాన్స్‌.. మరోసారి వరల్డ్‌క్‌పను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. సంచలన రీతిలో సెమీస్‌ చేరిన మొరాకోకు ఫ్రెంచ్‌ టీమ్‌ చెక్‌ పెట్టింది. పటిష్టమైన

డిఫెన్స్‌తో బడా బడా జట్లకే షాకిచ్చిన మొరాకో ఆటలు ఫ్రాన్స్‌ ముందు సాగలేదు. ఆరంభంలోనే గోల్‌ చేసి.. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టిన ఎంబప్పే బృందం.. మ్యాచ్‌ ఆసాంతం

పైచేయి ప్రదర్శించింది. ఇక, ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో బలమైన అర్జెంటీనాతో

అమీతుమీ తేల్చుకోనుంది.

అల్‌ ఖోర్‌ (ఖతార్‌): ఫేవరెట్‌ ఫ్రాన్స్‌.. అండర్‌ డాగ్‌ మొరాకో వరల్డ్‌కప్‌ కలను భగ్నం చేసింది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ఫ్రాన్స్‌ 2-0తో మొరాకోను ఓడించి.. వరుసగా రెండోసారి విశ్వకప్‌ తుదిపోరుకు చేరుకొంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో మరో దిగ్గజ జట్టు అర్జెంటీనాతో తలపడనుంది. ఫ్రెంచ్‌ ఆటగాళ్లు థియో హెర్నాండెజ్‌ (5వ), రండల్‌ కోలో మువాని (79వ) చెరో గోల్‌ సాధించారు. కెప్టెన్‌ రొయేన్‌ సైస్‌ పూర్తి ఫిట్‌నె్‌సతో లేకపోవడం.. గాయం కారణంగా డిఫెండర్‌ నయేఫ్‌ అగ్వర్డ్‌ మ్యాచ్‌కు దూరమవడం మొరాకో జట్టుపై ప్రభావం చూపింది. కానీ, ప్రపంచకప్‌ సెమీ్‌సలో ఆడిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించిన మొరాకో.. మూడో స్థానం కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో క్రొయేషియాతో తలపడనుంది. కాగా, ఈ సెమీస్‌ మ్యాచ్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ హాజరయ్యారు.

ఐదు నిమిషాల్లోనే గోల్‌: పవర్‌ఫుల్‌ ఎటాకింగ్‌ లైనప్‌ కలిగిన ఫ్రాన్స్‌.. మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బంతిపై మొరాకో ఎక్కువ ఆధిపత్యం ప్రదర్శించినా కీలక సమయాల్లో అద్భుతంగా రాణించిన ఫ్రాన్స్‌ ముందంజలో నిలిచింది. ఫస్టాఫ్‌ ఆరంభమైన 5వ నిమిషంలోనే ఫ్రెంచ్‌ తురుపుముక్క కిలియన్‌ ఎంబప్పే.. నేరుగా మొరాకో గోల్‌ పోస్టుపై దాడి చేశాడు. కీపర్‌ బోనోకు తగిలిన బంతిని సరిగా క్లియర్‌ చేయలేకపోవడంతో.. అక్కడే ఉన్న హెర్నాండెజ్‌ సూపర్‌ కిక్‌తో గోల్‌ చేశాడు. కంగుతిన్న మొరాకో వరుస దాడులు చేస్తూ ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసినా.. సఫలం కాలేదు. మధ్యలో ఫ్రాన్స్‌ స్టార్లు గ్రీజ్‌మెన్‌, గిరోర్డ్‌ కొన్ని ప్రయత్నాలు చేసినా ప్రత్యర్థి డిఫెన్స్‌ సమర్థంగా అడ్డుకొంది. అయితే, ఫస్టాఫ్‌ ఆఖరి నిమిషంలో మొరాకో దాదాపు గోల్‌ చేసినంత పని చేసింది. హకీమ్‌ జియేచ్‌ కొట్టిన కార్నర్‌ కిక్‌ను గిరోర్డ్‌ హెడర్‌తో బయటకు కొట్టాడు. కానీ, పెనాల్టీ ఏరియాలోనే ఉన్న జావాద్‌ అల్‌ యామిక్‌.. బైస్కిల్‌ కిక్‌తో నెట్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. కానీ, ఆఖరి నిమిషంలో ఫ్రెంచ్‌ కెప్టెన్‌, కీపర్‌ హ్యూగో లోరిస్‌ అద్భుతమైన డైవింగ్‌తో అడ్డుకోవడంతో మొరాకో నిరాశగా బ్రేక్‌కు వెళ్లింది. సెకండాఫ్‌ మొదలైన 8వ నిమిషంలో అట్లాస్‌ లయన్స్‌కు సువర్ణావకాశం లభించినా.. ఫ్రాన్స్‌ డిఫెండర్‌ వరానే అప్రమత్తతతో వ్యవహరించాడు. డి ఏరియాలోకి కొచ్చిన బౌఫాల్‌.. గోల్‌ ముందు నెసీరికి చక్కని క్రాస్‌ ఇచ్చాడు. నెసీరి ఒక్క టచ్‌ చేసి ఉంటే బంతి నెట్‌లోకి వెళ్లేది. కానీ, డిఫెండర్‌ అడ్డుపడడంతో గోల్‌ చేజారింది. అయితే, 79వ నిమిషంలో ఎంబప్పే మరో గోల్‌కు బాటలు వేశాడు. బంతిని దొరకబుచ్చుకొన్న ఎంబప్పే.. డిఫెండర్లను తప్పిస్తూ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కోలో మువానికి పాస్‌ ఇవ్వగా.. అతడు లాఘవంగా బంతిని నెట్‌లోకి పంపడంతో ఫ్రాన్స్‌ 2-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అదేజోరులో ఫ్రాన్స్‌ చివరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకొంది.

1 2002లో బ్రెజిల్‌ తర్వాత వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన జట్టుగా ఫ్రాన్స్‌

4 గత ఏడు ప్రపంచకప్‌లలో ఫ్రాన్స్‌ తుది సమరానికి (1998, 2006, 2018, 2022) చేరడం ఇది నాలుగోసారి

Updated Date - 2022-12-16T06:55:09+05:30 IST