Bhuvneshwar Kumar: జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించిన భువనేశ్వర్ కుమార్

ABN , First Publish Date - 2022-11-06T20:59:39+05:30 IST

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రికార్డును పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvaneswar Kumar) బద్దలుగొట్టాడు.

 Bhuvneshwar Kumar: జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించిన భువనేశ్వర్ కుమార్

మెల్‌బోర్న్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రికార్డును పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneswar Kumar) బద్దలుగొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో భువీ ఈ రికార్డు సాధించాడు. తొలి ఓవర్‌ తొలి బంతికే వికెట్ పడగొట్టిన భువీ ఈ ఘనత సాధించాడు. ఆ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వని భువనేశ్వర్ కుమార్ మెయిడెన్ వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ 11 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఖాతాలో 19 మెయిడెన్లు ఉండగా, తాజాగా ఆ రికార్డును అధిగమించిన భువీ.. 21 మెయిడెన్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇక, ఓవరాల్‌గా వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ 27 మెయిడెన్లతో ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 23, విండీస్ క్రికెటర్ శామ్యూల్ బద్రీ 21 మెయిడెన్లతో రెండుమూడు స్థానాల్లో ఉన్నారు. 21 మెయిడెన్లతో భువనేశ్వర్ కుమార్, 19 మెయిడెన్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గాయం కారణంగా బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ప్రపంచంలోనే మేటి బౌలర్లలో ఒకరిగా పేరుగాంచిన బుమ్రా జట్టుకు దూరం కావడంతో అతడిని అధిగమించే అవకాశం భువీకి లభించింది.

Updated Date - 2022-11-06T20:59:40+05:30 IST