ఉబ్బుతున్న పొట్ట.. కడుపు నొప్పంటూ కూతురు రెండ్రోజులుగా బాధపడుతోంటే ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. డాక్టర్లు చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-07-25T20:15:04+05:30 IST

ఆ బాలిక వయసు 14 ఏళ్లు.. గత రెండ్రోజులుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది..

ఉబ్బుతున్న పొట్ట.. కడుపు నొప్పంటూ కూతురు రెండ్రోజులుగా బాధపడుతోంటే ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. డాక్టర్లు చెప్పింది విని..

ఆ బాలిక వయసు 14 ఏళ్లు.. గత రెండ్రోజులుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది.. పొట్ట ఉబ్బుతుండడంతో తల్లి కంగారు పడింది.. వెంటనే కూతుర్ని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లింది.. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయం బయటపెట్టారు.. ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు.. నివ్వెరపోయిన తల్లి ఆ బాలికను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

US Job Offer: నాగ్‌పూర్ కుర్రాడికి అమెరికా సంస్థ నుంచి బంపరాఫర్‌, భారీ ప్యాకేజ్‌తో కొలువు ఇస్తామని పిలుపు.. కానీ,..


జైపూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన హిమాంశు అనే యువకుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఒకరోజు హోటల్‌కు తీసుకెళ్లి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే ఆ బాలికను, ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీంతో ఆ తర్వాత చాలా సార్లు ఆ బాలికపై హిమాంశు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఇంటికి లేదా స్నేహితుల రూమ్‌లకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. 


గత రెండ్రోజులుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతోంది. పొట్ట ఉబ్బినట్టు అనిపించడంతో ఆమె తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో ఆ బాలిక తనపై జరిగిన దురాగతం గురించి వెల్లడించింది. వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Read more