US Job Offer: నాగ్‌పూర్ కుర్రాడికి అమెరికా సంస్థ నుంచి బంపరాఫర్‌, భారీ ప్యాకేజ్‌తో కొలువు ఇస్తామని పిలుపు.. కానీ,..

ABN , First Publish Date - 2022-07-25T01:02:43+05:30 IST

ఆ కుర్రాడి వయసు 15 ఏళ్లే.. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు.. కానీ, ఆ కుర్రాడి తెలివి తేటలు మాత్రం ఆమోఘం.

US Job Offer: నాగ్‌పూర్ కుర్రాడికి అమెరికా సంస్థ నుంచి బంపరాఫర్‌, భారీ ప్యాకేజ్‌తో కొలువు ఇస్తామని పిలుపు.. కానీ,..

ఆ కుర్రాడి వయసు 15 ఏళ్లే.. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు.. కానీ, ఆ కుర్రాడి తెలివి తేటలు మాత్రం ఆమోఘం.. ఆ కుర్రాడి కోడింగ్ స్కిల్స్ (Coding skills) చూసి అమెరికా సంస్థ ముచ్చటపడింది.. భారీ ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేసింది.. అయితే ఆ కుర్రాడి వయసు ఇంకా 15 సంవత్సరాలే అని తెలుసుకుని వెనకడుగు వేసింది.. నిరుత్సాహపడవద్దని, చదువు పూర్తయ్యాక సంప్రదించాలని సూచించింది.. భవిష్యత్‌లో అతను కోరుకున్న జాబ్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. 


ఇది కూడా చదవండి..

Drunk Teacher: మందు కొట్టి స్కూల్‌కు వెళ్లిన లేడీ టీచర్.. క్లాస్‌లో స్పృహ తప్పి పడి ఉన్న ఆమెను చూసిన అధికారులు ఏం చేశారంటే..


నాగపూర్‌(Nagpur) కు చెందిన రాజేష్‌, అశ్వనీ దంపతుల కుమారుడు వేదాంత్ (15) పదో తరగతి చదువుతున్నాడు. కరోనా సమయంలో ఇంటి దగ్గర ఉండి ఆన్‌లైన్‌ క్లాసులు వినడంతో పాటు కోడింగ్‌ కోర్స్‌లు కూడా నేర్చుకున్నాడు. ఇటీవల తల్లీ ల్యాప్‌ట్యాప్‌లో ఇన్‌స్ట్రాగ్రామ్‌ చూస్తుండగా ఓ వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్ కాంపిటీషన్‌ (Website development competition) వేదాంత్ కంటపడింది. ఎవరైనా పాల్గొనవచ్చని తెలియడంతో వేదాంత్ కూడా ఆ కోడింగ్‌ కాపింటీషన్‌లో పాల్గొన్నాడు. కేవలం రెండు రోజుల్లో 2,066 లైన్లతో కోడింగ్ పూర్తి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 1000మంది పాల్గొన్న ఈ కోడింగ్‌ కాంపిటీషన్‌లో వేదాంత్‌ తనకిచ్చిన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు.


వేదాంత్ ప్రతిభ చూసిన అమెరికా న్యూజెర్సీకి చెందిన యాడ్‌ ఏజెన్సీ సంస్థ హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ ఇస్తామని, సంవత్సరానికి రూ.33లక్షల ప్యాకేజీ ఇస్తామని పిలిచింది. అయితే వేదాంత్ వయసు తెలుసుకుని వెనక్కి తగ్గింది. అయితే నిరాశ చెందవద్దని, చదువు పూర్తి చేసిన తర్వాత తమను సంప్రదించాలని సూచించింది. 

Updated Date - 2022-07-25T01:02:43+05:30 IST