Love with prisoner: జైలులో ఉన్న ఖైదీతో ప్రేమలో పడిన మహిళ.. చివరకు..
ABN , First Publish Date - 2022-08-16T01:24:54+05:30 IST
ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. నిజాయితీ గల ప్రేమ ఎదుటి వ్యక్తి లోపాలను పట్టించుకోదు.

ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. నిజాయితీ గల ప్రేమ ఎదుటి వ్యక్తి లోపాలను పట్టించుకోదు. అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా అతడి మీద ప్రేమ తగ్గదు. అమెరికా (America)కు చెందిన ఓ మహిళ జైలు జీవితం గడుపుతున్న ఓ ఖైదీతో ప్రేమలో (Women falls in love with prisoner) పడింది. తీవ్రమైన నేరం చేసిన వ్యక్తికి సహకరించాడనే కారణంతో అతడికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. సోషల్ మీడియాలోని ఓ యాప్ ద్వారా కాలిఫోర్నియాకు చెందిన బ్రిట్నీ సమ్మర్స్ అనే మహిళకు జైలు జీవితం గడుపుతున్న మైఖేల్ జేమ్సన్తో పరిచయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి..
Lucknow: ప్రాణం తీసిన రసమలై.. ఒకరి మృతి, ఎనిమిది మందికి అస్వస్థత..
ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. తరచుగా వీరిద్దరు జైలులో కలుసుకునేవారు. ఇద్దరి మనుసులు దగ్గరయ్యాయి. అప్పటికే ఓ బిడ్డకు తల్లి అయి భర్తకు దూరంగా ఉంటున్న బ్రిట్నీకి మైఖేల్ బాగా నచ్చాడు. దీంతో అతడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మైఖేల్ వచ్చే ఏడాది జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. మైఖేల్ బయటకు వచ్చిన తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని బ్రిట్నీ టిక్‌టాక్ ద్వారా తెలిపింది.
తామిద్దరం చిన్నతనం నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని, గత జీవితాలను మర్చిపోయి కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని బ్రిట్నీ పేర్కొంది. తామిద్దరం ఒకర్నొకరం అర్థంచేసుకున్నామని, మైఖేల్ జైలునుంచి బయటకు రాగానే పెళ్లిచేసుకుంటామని బ్రిట్నీ తెలిపింది. ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.