Lucknow: ప్రాణం తీసిన రసమలై.. ఒకరి మృతి, ఎనిమిది మందికి అస్వస్థత..

ABN , First Publish Date - 2022-08-15T23:45:36+05:30 IST

లక్నో (Lucknow)లో ఒక స్వీట్ షాప్‌లో రసమలై తిని ఒకరు మృతి చెందారు

Lucknow: ప్రాణం తీసిన రసమలై.. ఒకరి మృతి, ఎనిమిది మందికి అస్వస్థత..

లక్నో (Lucknow)లో ఒక స్వీట్ షాప్‌లో రసమలై తిని ఒకరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాఖీ పండగ రోజు తన సోదరులకు రాఖీ కట్టడానికి రాణి అనే మహిళ లక్నోలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. అలంబాగ్‌లోని ఒక దుకాణం నుంచి రసమలై (Rasmalai) కొని పట్టుకెళ్లింది. రాఖీ కట్టిన తర్వాత సోదరుడు రాకేశ్‌కు, మేనల్లుడికి, ఇతర కుటుంబ సభ్యులకు రసమలై ఇచ్చింది.


ఇది కూడా చదవండి..

Flight Delay: బాయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ మధ్య వాట్సాప్ ఛాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం!


రసమలై తిన్న కొద్ది సేపటి తర్వాత వారందరూ అస్వస్థతకు గురయ్యారు. అందరూ కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే అందరూ స్థానిక ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేశ్ (58) మరణించాడు. అతని భార్య, తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. దాంతో వారిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మిగిలిన వారు స్థానిక ఆస్పత్రిలోనే చికిత్స అందుకుని కోలుకుంటున్నారు. విషపూరిత మిఠాయిలు తిని ఒక వ్యక్తి మరణించినట్లు తెలుసుకున్న ఆహార శాఖ బృందం అలంబాగ్‌లోని ఆ స్వీట్ షాప్‌నకు చేరుకుంది. 


దుకాణంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆహార శాఖ బృందం స్వీట్లు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. వాటిని ల్యాబ్‌లకు పంపించింది. కాగా, స్వీట్లు ఎక్కువ కాలం నిలవ ఉండేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటిల్లో హానికారక రసాయనాలు కలుపుతున్నట్టు ఆహార శాఖ అధికారులు భావిస్తున్నారు. వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-08-15T23:45:36+05:30 IST