పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2022-07-22T01:11:42+05:30 IST

ఆ యువకుడు ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే అతడికి మంచి సంబంధం రావడంతో ఖాయం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. కల్యాణ...

పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!

ఆ యువకుడు ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే అతడికి మంచి సంబంధం రావడంతో ఖాయం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. కల్యాణ మండపంలో వరుడి బంధువులంతా ఎదురు చూస్తున్నారు. వధువు వస్తే తాళి కట్టడమే తరువాయి. అయితే మహారాష్ట్ర నుంచి రావాల్సిన వధువు మంటపానికి చేరుకోలేదు. చివరకు అసలు నిజం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధి సుఖ్లియా ప్రాంతానికి చెందిన అమూల్ గావ్లీ అనే యువకుడు.. పితాంపూర్‌లోని ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. 2015లో స్థానికంగా ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. 2016లో దీపావళి రోజున ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. తర్వాత ఓ రోజు యువతిని తన గదికి తీసుకెళ్లి, పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి ఆమెతో లవ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నాడు. వివిధ ప్రాంతాల్లో గది అద్దెకు తీసుకుంటూ ఆమెతో జీవనం సాగించాడు. అయితే పెళ్లి ప్రస్తావన వస్తే మాత్రం.. ఏవో సాకులు చెబుతూ వచ్చేవాడు. అయితే ఈ క్రమంలో అతడు.. మహారాష్ట్రలోని చాంద్‌పూర్ జిల్లా బలార్సాకు చెందిన యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. రోజూ ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు.

రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడనుకున్న పోలీసులు.. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఒకరిపై డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


తర్వాత ప్రియురాలిని దూరం పెడుతూ వచ్చాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ఆమెపై దాడి చేశాడు. చివరకు జూలై 9న మహారాష్ట్ర యువతిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే విషయం తెలుసుకున్న బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఎఫ్ఆర్ కాపీని పెళ్లి చేసుకోబోతున్న యువతికి సోషల్ మీడియా ద్వారా పంపించింది. దీంతో అముల్ గురించి తెలుసుకున్న మహారాష్ట్ర యువతి కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. నిందితుడిపై అత్యాచార కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం అతన్ని ముంబైలో అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

చీకటి గదిలో నాలుగేళ్లుగా ఆ భార్యకు నరకం.. మలమూత్రాల మధ్య జీవనం.. గది తలుపులు తీస్తే కనిపించిన దృశ్యం చూసి.. Read more