రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడనుకున్న పోలీసులు.. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఒకరిపై డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-07-22T00:03:49+05:30 IST

సాఫీగా సాగుతున్న వారి సంసారంలో ఒక్కసారిగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంత వరకూ బాగున్న భర్త.. ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో...

రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడనుకున్న పోలీసులు.. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఒకరిపై డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

సాఫీగా సాగుతున్న వారి సంసారంలో ఒక్కసారిగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంత వరకూ బాగున్న భర్త.. ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులంతా నిజంగా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడని అనుకున్నారు. అయితే మృతుడి తల్లిదండ్రులకు మాత్రం ఒకరిపై అనుమానం ఉండేది. చివరకు పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.


రాజస్థాన్ రాష్ట్రం జోద్‌పూర్ ప్రాంతానికి చెందిన రమేష్ అనే యువకుడు.. 2018లో గుడ్డి అనే యువతిని అట్టా-సత పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఈ పద్ధతి ప్రకారం రమేష్ మేనకోడలు కవితను.. గుడ్డి సోదరుడు వివాహం చేసుకున్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో అనూహ్యంగా విషాధ ఘటన చోటు చేసుకుంది. జూలై 18న రమేష్‌తో పాటూ అతని మేనకోడలు కారు ఢీకొని మృతి చెందారు. స్థానికులంతా రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయారని అనుకున్నారు. అయితే ఏడాదిగా కోడలు గుడ్డి ప్రవర్తనలో తేడా ఉండడంతో రమేష్ కుటుంబ సభ్యులకు ఓ వ్యక్తిపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. మృతుడు రమేష్ భార్య గుడ్డి.. అప్పటికే శంకర్ పటేల్ అనే వ్యక్తిని ప్రేమించేది. అయితే పెద్దల బలవంతం మీద రమేష్‌ను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత కూడా ప్రియుడిని తరచూ కలుస్తూ ఉండేది.

చీకటి గదిలో నాలుగేళ్లుగా ఆ భార్యకు నరకం.. మలమూత్రాల మధ్య జీవనం.. గది తలుపులు తీస్తే కనిపించిన దృశ్యం చూసి..


అయితే భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. అలాగే రమేష్ మేనకోడలిని కూడా హత్య చేస్తే.. తన తమ్ముడికి విముక్తి కలుగుతుందని గుడ్డి భావించింది. ఈ క్రమంలో పలుమార్లు రమేష్‌ను హత్య చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరగా జూలై 18న నడుచుకుంటూ వెళ్తున్న రమేష్, అతని మేనకోడలిని కారుతో ఢీకొట్టించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి భార్య గుడ్డి, రాకేష్ సుధార్, రమేష్ మాలి, సోహన్ పటేల్‌ అనే నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శంకర్ పటేల్ కోసం గాలిస్తున్నారు.

బస్టాండ్‌లో ఉండగా లిప్‌స్టిక్‌ అడిగిన భార్య.. సరేనని షాపునకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి షాకింగ్ ట్విస్ట్.. అసలు కథేంటంటే..



Updated Date - 2022-07-22T00:03:49+05:30 IST