పొద్దున్నే టిఫిన్ ఇచ్చిన భార్య.. ఒక్క స్పూన్ తిని పక్కన పెట్టేసి గదిలోకి వెళ్లిన భర్త.. మరుక్షణంలోనే..

ABN , First Publish Date - 2022-04-20T21:48:25+05:30 IST

ఇటీవల చిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. దంపతుల విషయంలో ఇలాంటి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. భార్యపై అనుమానం..

పొద్దున్నే టిఫిన్ ఇచ్చిన భార్య.. ఒక్క స్పూన్ తిని పక్కన పెట్టేసి గదిలోకి వెళ్లిన భర్త.. మరుక్షణంలోనే..
ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల చిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. దంపతుల విషయంలో ఇలాంటి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకుని.. చివరకు హత్య చేసేవారు కొందరైతే, మరికొందరు మరీ చిన్న కారణాలకు కూడా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ దారుణాలకు తెగపడుతున్నారు. ముంబయిలో ఓ దంపతుల విషయంలో ఇలాగే జరిగింది. పొద్దున్నే భర్త కోసం భార్య టిఫిన్ చేసుకొచ్చి ఇచ్చింది. ఒక్క స్పూన్ తిని పక్కన పెట్టిన భర్త గదిలోకి వెళ్లాడు. మరుక్షణంలో జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.


మహారాష్ట్ర ముంబయిలోని నవ్‌ఘర్ ప్రాంతంలో నికేష్ ఘాగ్, నిర్మల(40)దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 12ఏళ్ల చిన్మయ్ అనే కుమారుడు ఉన్నాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో నికేష్.. కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నిర్మల టిఫిన్ చేసి, భర్తకు వడ్డించింది. అయితే ఒక్క స్పూన్ తిన్న నికేష్.. వెంటనే పక్కన పడేశాడు. కోపంతో ఊగిపోతూ బెడ్‌రూంలో ఉన్న భార్య వద్దకు వెళ్లాడు. ‘‘టిఫిన్‌లో ఉప్పు ఎక్కువ వేస్తావా’’..అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వారి కుమారుడు చిన్మయ్.. తండ్రిని వారించేందుకు ప్రయత్నించాడు. అయినా వినకుండా నికేష్.. ఆమె గొంతు నులిమి చంపేశాడు.

అమ్మా.. నాన్నా.. ఓ అంకుల్.. భయంతో అల్మారాలో దాక్కున్నానంటూ 7 ఏళ్ల పిల్లాడు చెప్పిన మర్డర్ మిస్టరీ..!


తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి హత్యపై చిన్మయ్.. తన అమ్మమ్మ, మేనమాకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కుమార్తె, అల్లుడి మధ్య ఇటీవల కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే శనివారం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను శుక్రవారం ఉపవాసం ఉన్నానని, అయితే తన భార్య అల్పాహారంలో ఉప్పు ఎక్కువగా వేయడంతో గొడవ జరిగిందని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి, అనంతరం పోలీసు కస్టడీకి తరలించారు.

కింద పడటం వల్ల గాయాలయ్యాయని డాక్టర్‌తో అబద్ధం చెప్పిన 84 ఏళ్ల వృద్ధురాలు.. కానీ అసలు నిజమేంటంటే..

Updated Date - 2022-04-20T21:48:25+05:30 IST