‘‘నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు’’.. అంటూ చివరకు ఆ వ్యక్తి చేసిన పని..

ABN , First Publish Date - 2022-05-18T13:26:54+05:30 IST

తెలిసి చేస్తారో, తెలీక చేస్తారో తెలీదు గానీ... కొందరు చిన్న చిన్న సమస్యలకే హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు తనువు చాలిస్తుంటే.. మరికొందరు ఆర్థిక...

‘‘నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు’’.. అంటూ చివరకు ఆ వ్యక్తి చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

తెలిసి చేస్తారో, తెలీక చేస్తారో తెలీదు గానీ... కొందరు చిన్న చిన్న సమస్యలకే హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు తనువు చాలిస్తుంటే.. మరికొందరు ఆర్థిక, ప్రేమ సంబంధిత సమస్యలతో జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. కొందరు ప్రబుద్ధులైతే తమలోని శాడిజాన్ని ఎదుటి వారి మీద చూపిస్తూ ఇబ్బందులు పెడుతుంటారు. అయితే మహారాష్ట్రలో జరిగిన ఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. నా భార్యకు చీర కట్టుకోవడం రాదు, కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు.. అంటూ లేఖ రాసిన వ్యక్తి చివరకు ఏం చేశాడంటే...


మహారాష్ట్ర ఔరంగాబాద్ పరిధి ముకుంద్ నగర్‌కు చెందిన సామధాన్ సాబ్లే(24)కు ఆరు నెలల క్రితం తన కంటే ఆరేళ్లు పెద్ద వయసున్న యువతితో వివాహమైంది. అయినా వారి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. తరచూ ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి సామధాన్.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతవరకూ బాగున్న అతను ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు షాకింగ్ నిర్ణయం.. భర్తకు విడాకులు.. ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ..


సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ’’నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం నడవడం కూడా రాదు. అలాంటి ఆమెతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’’.. అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన వారంతా షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అంతా చర్చించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సామధాన్ మృతికి అదే కారణమా..? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

భర్తకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పెళ్లైన మూడో రోజే ఇంట్లోంచి ఎస్కేప్.. మర్నాడే భార్య వీడియో కాల్ చేసి..

Read more