ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులు కూడా కాకముందే ఓ యువకుడి బలవన్మరణం.. తండ్రికి చివరగా వాట్సప్‌లో పంపిన మెసేజ్‌లో..

ABN , First Publish Date - 2022-05-21T17:48:13+05:30 IST

పెళ్లిళ్ల సమయాల్లో కట్నం విషయంలో సమస్యలు తలెత్తడం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగా కొన్ని సార్లు ఆఖరి నిముషంలో పెళ్లిళ్లు రద్దయిన సందర్భాలు కూడా ఎన్నోసార్లు...

ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులు కూడా కాకముందే ఓ యువకుడి బలవన్మరణం.. తండ్రికి చివరగా వాట్సప్‌లో పంపిన మెసేజ్‌లో..

పెళ్లిళ్ల సమయాల్లో కట్నం విషయంలో సమస్యలు తలెత్తడం చూస్తూనే ఉన్నాం. ఈ కారణంగా కొన్ని సార్లు ఆఖరి నిముషంలో పెళ్లిళ్లు రద్దయిన సందర్భాలు కూడా ఎన్నోసార్లు చూశాం. సాధారణంగా వరుడి కుటుంబ సభ్యులే సమస్యలు సృష్టిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుని 15రోజులు కూడా కాకముందే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చివరగా తండ్రికి వాట్సప్ మెసేజ్ చేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధి ద్వారకాపురిలో నివాసం ఉంటున్న అంకిత్(23).. మే 3న  శివాని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యను తీసుకుని ఓంకారేశ్వర్‌ వెళ్లాడు. శివాని తండ్రి కూతురికి ఫోన్ చేసి.. ‘‘నీ మీద ఎలాంటి కోపం లేదు.. ఇంటికి వచ్చి వెళ్లు’’.. అని ఇండోర్‌కి పిలిపించాడు. పుట్టింటికి వెళ్లిన శివానిని.. గంగానగర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో బంధించాడు. మే 8వ తేదీ నుంచి ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. భార్యను పంపించాలని అంకిత్ పలుమార్లు విన్నవించుకున్నాడు. అయితే రూ.50 వేలు ఇస్తే పంపిస్తానని శివాని తండ్రి షరతు విధించాడు. బట్టల దుకాణంలో పని చేసే అంకిత్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఆలోచనలో పడ్డాడు.

5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!


జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలియజేశాడు. రూ.50 వేలు ఇచ్చి కోడలిని తీసుకురావడం.. అతడికి ఇష్టం లేదు. దీంతో అంకిత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గురువారం తండ్రికి.. ‘మిస్‌ యూ పాపా’ అని వాట్సప్ మెసేజ్ చేశాడు. అలాగే ఇంట్లోని గోడపై భార్య శివాని పేరు, మొబైల్ నంబర్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంకిత్ మొబైల్‌లో ఆడియో, వీడియో రికార్డింగ్‌ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఫొటోలోని ఆరేళ్ల పాప ఇప్పుడు బతికిలేదు కానీ అయిదుగురి ప్రాణాలను కాపాడింది.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2022-05-21T17:48:13+05:30 IST