Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 19 May 2022 12:19:52 IST

5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!

twitter-iconwatsapp-iconfb-icon
5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!

ప్రేమ సంబంధిత వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల దారుణ ఘటనలు తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. రోజూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించాలంటూ యువతులను వేధించడం, ప్రేమ వివాహాలకు పెద్దలు అంగీకరించకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.  వారికి ఐదు నెలల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో ఓ రోజు డాబాపై పడుకుని ఉన్న కొడుకు, కోడల్ని లేపేందుకు తండ్రి వెళ్లాడు. తీరా అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్ఫూర్ పరిధి దర్శన్‌పూర్వాలో శివ తివారీ అలియాస్ శివమ్ (27), జూలీ రాజ్‌పుత్ (25) దంపతులు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శివ టీ దుకాణం నడుపుతూ కటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తలకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో వారి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి  శివమ్ తన భార్యతో కలిసి ఇంటి డాబాపై పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం శివమ్ తండ్రి దీప్‌కుమార్‌ తివారీ.. వారిని నిద్ర లేపేందుకు వెళ్లాడు. లోపలికి వెళ్లగానే కొడుకు, కోడలు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు.

ఈ ఫొటోలోని ఆరేళ్ల పాప ఇప్పుడు బతికిలేదు కానీ అయిదుగురి ప్రాణాలను కాపాడింది.. అసలేం జరిగిందంటే..

ఊహించని ఈ ఘటనతో శివం తండ్రితో పాటూ స్థానికులంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని దుండగులు శివమ్ దంపతులను కత్తితో గొంతు కోసి పరారైనట్లు గుర్తించారు. మృతుల సన్నిహితులే ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. శివమ్ ప్రేమ వివాహాన్ని అతడి బంధువులు వ్యతిరేకించారని తెలిసింది. దీంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. 

పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ప్రేమించింది.. ఓ రోజు ప్రియుడు పిలవడంతో ఊరి బయటకు వెళ్లింది.. తీరా చూస్తే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: జలపాతం వద్ద స్టంట్ చేయాలని చూసిన యువకుడు.. మరుక్షణమే అతడి పరిస్థితి.. videoఇక నుంచి తప్పు చేయనంటూ భార్యను నమ్మించాడు.. మరుసటి రోజు రాత్రి అన్నతో పాటూ భార్య గదికి వెళ్లి.. పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను మర్నాడు ఓపెన్ చేసి చూసిన వరుడికి దిమ్మతిరిగే షాక్.. ఆ గిఫ్ట్‌ను ఇచ్చిందెవరో తెలిసి..ప్లాస్టిక్ డ్రమ్ము నిండా కాంక్రీట్.. సుత్తితో పగలగొడితే కనిపించిన దృశ్యం చూసి అందరికీ మైండ్ బ్లాక్.. ఇదేం పని అని నిలదీస్తే..అమ్మాయిలా ప్రవర్తిస్తున్నావంటూ హేళన చేస్తున్న ఫ్రెండ్స్.. వాళ్లను పార్టీకి పిలిచి మరీ ఆ ఇంటర్ కుర్రాడు చేసిన దారుణమిదీ..! Viral Video: ఈ కుక్కది ఎంత మంచి మనసు.. పులి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి.. video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.